Friday, July 9, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ


సుందర తెనుగిని కవితాబద్ధం చేయదలచి
నాలోని ఆవేశాన్ని కలములో గుక్కి మాటలు పేర్చ ప్రయత్నించితి.

అక్షరాలు ఎన్నుంటే ఏమి -
వర్ణమాలలు ఎన్ని గుచ్చి నిను కీర్తించగలను

హ్రస్వములతో మొదలెట్టినా
ధీర్ఘములతో లాలించినా
వక్రములలో నిను గాంచినా
వక్రతమములతో అచ్చులన్ని పేర్చిన
నా భావావేషమున నీ స్తోత్రం కానరాదేం.

పరుషములతో పలు మారులు మధించినా
సరళములతో పెక్కువిధాల జగడమొనర్చినా
అనునాసికములతో ఆలోచనలు వేడెక్కగా
శేషించిన ఊష్మములు వెక్కిరించగా
స్థిరములు చివరగా నను పలుకరించినా
నే రాయలేనే నా తల్లి నీ సోయగాల వాచకం
నే రాయలేనే నా తల్లి నీ సొగసైన వైశిష్ఠ్యం.
అందుకే -
నా కలము మూగవోయే - నిను కీర్తింప
నీ భాషయే నీకు కరువాయే - నిను వర్ణింప.

1 comment:

Anonymous said...

బావుంది