Sunday, July 11, 2010

కులసర్పదోషం


నే అతివాదిని కాదు
నేను కులవాదినీ కాదు
నాకే మతమూ లేదు
మంచి అన్నది నా కులమైతే
మనిషన్నవాడే నా మతము
నువ్వూ నేనూ ఒకే జాతి వాళ్ళము
అయినా -
నీకు నాకూ ఏంటి ఈ ఘోష!!
శూద్రుడు పండిస్తే బాపన్న ముట్టలేదా
కమ్మరి కుండలో పూజారి వండలేదా
వైశ్యుని ఇంట పాడి వెలసి
ఐష్వర్యం కలగలేదా
దేవుడికి చేరే నైవేద్యంలో
ఉన్నదా భేదం
శాలి నేస్తే బట్ట కట్టలేదా
జాలరి పగ్గంలో బతుకు చూడలేదా
క్షేత్ర లక్ష్మి ఆరాధనలో
మనమంతా మునగలేదా
ఆ తల్లి ధాన్య ప్రసవంలో
ఏదీ భేదం
ఎవరికి ఎవరు తీసిపోయారు
నాగలి పట్టినా కొడవలి కమ్మకు
పొలము దున్నినా పైరు కాపుకు
కుప్పనూర్పిళ్ళ పనిగాళ్ళకు
ఏటివతనుకు
మనందరి విలువను కట్టే
క్రైస్త జాదువులు
మహమ్మదీ ద్వేషాలు
హిందూత్వ మూఢులు
వీళ్ళు పోషించే వైషమ్యం
నీకు నాకు మాత్రమే కాదు
వీళ్ళందరికి అబ్బిందీ ఘోష
బ్రమ్మకే తెలీనీ భేదాలను
నువ్వు నేను సృష్టించాము
ఊహూ -
మనకి మాత్రమే అబ్బింది ఈ విద్య
మనకి మాత్రమే పట్టింది ఈ ఘోష


1 comment:

Ennela said...

excellent andee....
meeku shubhaabhinandanalu...