Friday, September 30, 2011

వృక్షం

నింగిని తాకాలనే ఆరాటం

నేలంతా తనదని అల్లుకుపోటం


కాళ్ళు మాత్రం భూమ్మీదే

వృక్షం, నీకు వందనం..!!

Tuesday, June 7, 2011

శాంతిమాత

తరాలు మారిపోతున్నా, నవతరం నిలిచిపోయింది
నవతరం మాటునా, అంతరాలు కుచించుపోయింది 

ఊరూ వాడా ఏకమవుతున్న యువత జోరు 
ఆలోచనా రహిత ఆవేశాలా మాటున హోరు 

శాంతిమాత ఉనికి కరుమరుగవుతుంది
శాంతి మత ఉరికి  కరుడుగట్టింది 

తరాలు మారిపోతున్నా, నవతరం నిలిచిపోయింది 
కాల చక్రంలో ఇదే నవ మా'నవ ' తరం అయ్యింది




Sunday, July 11, 2010

కులసర్పదోషం


నే అతివాదిని కాదు
నేను కులవాదినీ కాదు
నాకే మతమూ లేదు
మంచి అన్నది నా కులమైతే
మనిషన్నవాడే నా మతము
నువ్వూ నేనూ ఒకే జాతి వాళ్ళము
అయినా -
నీకు నాకూ ఏంటి ఈ ఘోష!!
శూద్రుడు పండిస్తే బాపన్న ముట్టలేదా
కమ్మరి కుండలో పూజారి వండలేదా
వైశ్యుని ఇంట పాడి వెలసి
ఐష్వర్యం కలగలేదా
దేవుడికి చేరే నైవేద్యంలో
ఉన్నదా భేదం
శాలి నేస్తే బట్ట కట్టలేదా
జాలరి పగ్గంలో బతుకు చూడలేదా
క్షేత్ర లక్ష్మి ఆరాధనలో
మనమంతా మునగలేదా
ఆ తల్లి ధాన్య ప్రసవంలో
ఏదీ భేదం
ఎవరికి ఎవరు తీసిపోయారు
నాగలి పట్టినా కొడవలి కమ్మకు
పొలము దున్నినా పైరు కాపుకు
కుప్పనూర్పిళ్ళ పనిగాళ్ళకు
ఏటివతనుకు
మనందరి విలువను కట్టే
క్రైస్త జాదువులు
మహమ్మదీ ద్వేషాలు
హిందూత్వ మూఢులు
వీళ్ళు పోషించే వైషమ్యం
నీకు నాకు మాత్రమే కాదు
వీళ్ళందరికి అబ్బిందీ ఘోష
బ్రమ్మకే తెలీనీ భేదాలను
నువ్వు నేను సృష్టించాము
ఊహూ -
మనకి మాత్రమే అబ్బింది ఈ విద్య
మనకి మాత్రమే పట్టింది ఈ ఘోష


Friday, July 9, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ


సుందర తెనుగిని కవితాబద్ధం చేయదలచి
నాలోని ఆవేశాన్ని కలములో గుక్కి మాటలు పేర్చ ప్రయత్నించితి.

అక్షరాలు ఎన్నుంటే ఏమి -
వర్ణమాలలు ఎన్ని గుచ్చి నిను కీర్తించగలను

హ్రస్వములతో మొదలెట్టినా
ధీర్ఘములతో లాలించినా
వక్రములలో నిను గాంచినా
వక్రతమములతో అచ్చులన్ని పేర్చిన
నా భావావేషమున నీ స్తోత్రం కానరాదేం.

పరుషములతో పలు మారులు మధించినా
సరళములతో పెక్కువిధాల జగడమొనర్చినా
అనునాసికములతో ఆలోచనలు వేడెక్కగా
శేషించిన ఊష్మములు వెక్కిరించగా
స్థిరములు చివరగా నను పలుకరించినా
నే రాయలేనే నా తల్లి నీ సోయగాల వాచకం
నే రాయలేనే నా తల్లి నీ సొగసైన వైశిష్ఠ్యం.
అందుకే -
నా కలము మూగవోయే - నిను కీర్తింప
నీ భాషయే నీకు కరువాయే - నిను వర్ణింప.

Wednesday, April 8, 2009

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు!!

నీ ఇరువై తొమ్మిదో వసంతమున
అందె వచ్చిన నీ జాబిలిని నువ్వు
చేపట్టెబోయే ముహూర్తానా
గోప్యంగా అందిన ఆ మహేశుని ఆశీస్సులు
భావ పరిమళములై పెళ్ళి పందిట నిలవగా,
నీ వివాహ వేడుకలో ఆనందలత అల్లుకున్నా వేళ
పల్లవించిన శతమానాలు బాధ్యతై
నిను చేరగా, పెళ్ళి మంత్రాలలో చేసిన
బాసలు జీవితాంతం నిలుపుకునే సౌశీల్యం
నిండిన విశాల హృదయం అందెది.


నిధి కన్న మిన్న ఐనా నీ స్నేహ పెన్నిధి లో
మధువుగా మరింత చేరువై తనను తాను
అర్పించుకుని నీలో సగభాగం అవగా,
మాంగల్యధారణతో ఏర్పడిన బ్రహ్మముడి
సప్తపది తో నీ సహధర్మచారిణిగా మారగా
అమోఘ దీవెనలు పొందుతు మీరువురూ
ఒకింటి వారవుతున్నా సుముహూర్తాన
మీకివియే నా కవితా శుభాభినందనలు!!




నా బాల్య మిత్రుడు ప్రాణ స్నేహితుడు ఈరోజు తన మనసుకి నచ్చిన మగువని మనువాడి ఒకింటివాడవుతున్న సందర్భముగా ఈ కవితాముఖంగా వివాహ మహోత్సవ శుభాభివందనములు..!